శంఖవరం మన న్యూస్ (అపురూప్): ఆదర్శ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ చేయడం జరుగుతుందని అర్హత కలిగిన విద్యార్థులు మే 22 ముందే ఆన్ లైన్ లో వెబ్సైట్ apms.apcfss.in నందు దరఖాస్తు చేసుకోవాలని, ఇప్పటికే 220 దరఖాస్తులు అందాయని ఇంచార్జి ప్రిన్సిపల్ డా వై ఎస్ వి కిరణ్ తెలియ జేశారు. కళాశాల యందు ఎంపీసీ, బైపిసి, ఎంఈసి, సిఈసి గ్రూపులు ఉన్నాయని, ప్రవేశములు మార్కులు ఆధారంగా ఎంపిక జరుగుతుందని తెలియ జేశారు. శంఖవరం మోడల్ స్కూల్ లో అనుభవజ్ఞులైన ఉపాద్యాయులు ఉన్నారని, ఇంటర్ రిజల్ట్స్ కూడా బాగా వచ్చాయని, ఈ అవకాశం చివరి రెండు రోజులు మాత్రమే ఉందని కావున పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులు అందరూ ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసారు...