మన న్యూస్ ,నెల్లూరు రూరల్, మే 20:మే 27 నుంచి కడపలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించే మహానాడుకు సంబంధించి భోజన ఏర్పాట్ల కమిటీ సభ్యులుగా నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం కాసేపటి క్రితం మహానాడుకు సంబంధించిన వివిధ కమిటీలను ప్రకటించింది. మహానాడుకు వచ్చే లక్షలాదిమంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మొత్తం 20 మందితో మహానాడు భోజన ఏర్పాట్ల కమిటీని ఏర్పాటు చేశారు.