మన న్యూస్, గూడూరు, మే 20: తిరుపతి జిల్లా గూడూరు జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పురుషోత్తమరావు దాతృత్వంలో వారి మనవడు మనమరాలు పుట్టినరోజు సందర్భంగా అండర్ బ్రిడ్జి దగ్గర ఏ పని చేసుకోలేక నిరాశ్రయులైనటువంటి ధారా హనుమంతు కుటుంబానికి ప్రొవిజన్స్, దానిమ్మపండ్లు, బత్తాయి, యాపిల్ పండ్లు, అరటి పండ్లు, మరియు కూరగాయలు మాజీ కౌన్సిలర్ తూపిలి ప్రకాష్ చేతుల మీదుగా పంపిణీ చేయడమైనది. జె బి బి గౌరవాధ్యక్షులు పురుషోత్తమరావు మాట్లాడుతూ.... నా మనవడు మరియు మనవరాలు పుట్టినరోజు సందర్భంగా ఒక నిరుపేద కుటుంబానికి సహాయం చేసినందుకు చాలా ఆనందంగా ఉందని వారి కుటుంబానికి అవసరమైనటువంటి సరుకులు అన్నీ అందజేయటం చాలా సంతోషంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జే.వి.వి అధ్యక్షులు వేగూరు రాజేంద్రప్రసాద్, చెంచు నారాయణ, పురుషోత్తమరావు, రామమోహన్, టీచర్ రాదయ్య, ఆనంద్, పసల వెంకటేశ్వర్లు, పురుషోత్తం పాల్గొన్నారు.