గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 20:- జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల కేంద్రం లోని మండల అధ్యక్షులు బోయ నాగరాజు,శశి, రామకృష్ణ, మురళి యాదవ్, ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బిజెపి కౌన్సిల్ మెంబర్ బండల వెంకట రాములు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. జమ్ము కాశ్మీర్లో పహల్గాం ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రదాన్ని నిరసిస్తూ భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర కు సంఘీభావంగా భారత సైనికులకు మద్దతుగా ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని భారతదేశం సత్తా ప్రపంచ దేశాలకు తెలిసిందని అలాగే భారతదేశం మీద సార్వభౌమత్వం మొత్తం మీద దాడి చేస్తే పాకిస్తాన్ లాంటి దేశాలు భారతదేశం మీద దాడి చేస్తూ మతకల్లోలం సృష్టించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు దాడికి ప్రతికారంగా మన దేశ సైనికులు పాకిస్థాన్ మీద యుద్ధం చేస్తూ ఉగ్రవాద స్థావరాలు నాశనం చేస్తూ పాకిస్తాన్ మీద విజయం సాధించడం జరిగింది కావున భారత సైనికులకు మద్దతుగా ఆపరేషన్ సింధూరకు సంఘీభావంగా వడ్డేపల్లి మండల కేంద్రంలో తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సినియర్ నాయకులు సంజీవ రెడ్డి,లాయర్ శ్రీను,మధుసూదన్ గౌడ్,రాజశేఖర్ శర్మ, నరసింహులు, వడ్డేపల్లి సూరి ,దురెందర్ యాదవ్ అఖిల పక్ష నాయకులు , విశ్వహిందూ పరిషత్ సభ్యులు బంగారు వెంకటేష్,ప్రేమ్ కుమార్, తిమ్మప్ప పెద్దబాబు రాఘవేంద్ర పర్ష ,రంగస్వామి ,బి కే శ్రీనివాసులు,మహేష్, వెంకటేష్, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు..