మన న్యూస్, ఉదయగిరి ,మే 19 :*గ్రామాలలో గత ఐదు సంవత్సరాల లో వైసిపి పాలనలో చేయలేని అభివృద్ధిని,కూటమి ప్రభుత్వం 11నెలల్లో చేసి చూపించింది.*చంద్రబాబు నాయకత్వంలో పునర్వైభవం వైపు అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్.*ఉదయగిరి నియోజకవర్గాన్ని పారిశ్రమికంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యెక కృషి చేస్తున్న కాకర్ల సురేష్.*ఈనెల 23 వ తేదీన నెల్లూరు వీపీఆర్ కన్వెన్షన్ లో జరుగు నెల్లూరు పార్లమెంట్ మహానాడు ను జయప్రదం చేయండి. ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు లో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అధ్యక్షతన జరిగిన ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహానాడు లో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వేంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ...........వైసిపి ఐదు సంవత్సరాల పాలనలో అన్ని వ్యవస్థలు గాడి తప్పాయి.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 11 నెలల కాలంలో ఈ వ్యవస్థలు అన్నింటినీ గాడి లో పెట్టే ప్రయత్నం చేస్తుంది అని అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి పుణః ప్రారంభం చేసింది.పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి అని అన్నారు.2014 - మధ్య తెలుగుదేశం ప్రభుత్వం హయంలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి.అటుతరువాత అధికారంలోకి వచ్చిన జగనమోహన్ రెడ్డి బెదిరింపులతో పరిశ్రమలు అన్ని ఇతర రాష్ట్రాలకు తరలి పోయాయి అని తెలిపారు. మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు నాయుడు పై ఉన్న నమ్మకంతో రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పడం కోసం పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు అని అన్నారు.ఈ 11 నెలల కూటమి ప్రభుత్వం లో దాదాపు 5 లక్షలు కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు కుదిరాయి. దీని వలన దాదాపు 5 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగాలు రానున్నాయి అని అన్నారు.గ్రామ పంచాయతీ లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా గత వైసిపి ప్రభుత్వం దారి మల్లించింది.దాంతో గ్రామాలలో అభివృద్ధి కుంటు పడింది అని అన్నారు.గ్రామాలలో గత ఐదు సంవత్సరాల లో వైసిపి పాలనలో చేయలేని అభివృద్ధిని,కూటమి ప్రభుత్వం 11నెలల్లో చేసి చూపించింది.అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు నిర్మించింది అని అన్నారు.ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ తన పుట్టిన ప్రాంతానికి సేవ చేయాలనే తలంపుతో విదేశాల్లో మంచి వ్యాపారాలను వదులుకొని రాజకీయాలలోకి వచ్చి మీ అందరి ఆశీస్సులు తో ఉదయగిరి శాసనసభ్యులు గా ఎన్నికయ్యారు అని అన్నారు.శాసనసభ్యులు గా ఎన్నికైన ఈ 11 నెలల కాలంలో దాదాపుగా రూ.200 కోట్లు రూపాయలు నిధులు తెచ్చారు.వింజమూరు లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారు అని అన్నారు.ఉదయగిరి నియోజకవర్గం ను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి అనేక ప్రణాళికలురూపొందిస్తున్నారు.ముఖ్యమంత్రి ఆశీస్సులతో ఉదయగిరి నియోజకవర్గాన్ని కాకర్ల సురేష్ ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.ఈనెల 23 వ తేదీన నెల్లూరు వీపీఆర్ కన్వెన్షన్ లో జరుగు నెల్లూరు పార్లమెంట్ మహానాడు ను జయప్రదం చేయండి అని తెలియజేశారు.