మన న్యూస్: పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలంలోని వలస ఆదివాసి గ్రామాలైన మద్దెలగూడెం, తిర్లాపురం ఆదివాసి యువకులకు బయ్యారం పోలీస్ స్టేషన్ తరఫున సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రాజ్ కుమార్ ఆధ్వర్యంలో వాలీబాల్ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ వెంకటేశ్వర్లు ,ఎస్ఐ రాజ్ కుమార్ మాట్లాడుతూ యువత క్రీడల ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసానికి దోహదపడతయని ,ఆటల ద్వారా స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని అన్నారు. గ్రామాల్లోని యువత చెడు మార్గాల వైపు పయనించకుండా ,సంఘ వ్యతిరేక శక్తులకు సహాయం చేయకుండా ఉన్నత మార్గంలో నడవాలని, చిన్న వయసులోనే మత్తు పదార్థాలు, గంజాయి, డ్రగ్స్ మహమ్మారిన పడకుండా ఉండాలని లేని పక్షంలో తమ విలువైన జీవితాన్ని కోల్పోవడం జరుగుతుందని తెలిపారు . మత్తు పదార్థాలకు బానిస కాకుండా సామాజికంగా, ఆర్థికంగా తమ కుటుంబ ఎదుగుదలకు తోడ్పడాలని ఆదివాసి యువకులకు సూచించడం జరిగింది.