మన న్యూస్ ,నెల్లూరు, మే 19: ప్రభుత్వ భూములు ఆక్రమించాలనుకొనేవాళ్ళు ఆ ఆలోచన మానుకోవాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హెచ్చరించారు .ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకొంటామన్నారు .ఆ భూములను ప్రజోపయోగకరంగా మారుస్తామని వెల్లడించారు . సోమవారం సిటీ అభివృద్ధిపై అధికారులు ,కాంట్రాక్టర్లు ,పార్టీ నేతలు ,కోఆర్డినేటర్లతో నెల్లూరు క్యాంప్ కార్యాలయంలో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు .రెవెన్యూ సమస్యల పరిష్కారం పై ప్రత్యేక ద్రుష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు .ప్రభుత్వ భూములు ఆక్రమించాలన్న ఆలోచన మానుకోవాలని హెచ్చరించారు .ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకొని ప్రజావసరాలకు వాటిని వినియోగిస్తామన్నారు .సిటీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు . రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అభివృద్ధి ఎక్కడా ఆగటం లేదని స్పష్టం చేసారు .ప్రజాసమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ,పార్టీ నేతలకు సూచించారు .రాష్ట్రంలో 68 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయన్నారు .32 వేల కోట్లు ప్రభుత్వానికి ఖర్చు అవుతోందని తెలిపారు .నిబంధనల ప్రకారం అనర్హుల కార్డులు మాత్రమే తొలగిస్తారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు .అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ పధకాలు అందుతాయని తెలిపారు .పార్కులు ,పాఠశాలల పనులు పది రోజుల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్ లను మంత్రి నారాయణ ఆదేశించారు .సిటీ లో మిగిలి ఉన్న డ్రైన్ల పనులు త్వరలో ప్రారంభించమని అధికారులను మంత్రి ఆదేశించారు .సమీక్షలో కార్పొరేషన్ కమీషనర్ నందన్ ,మాజీ మున్సిపల్ చైర్పెర్సన్ తాళ్ళపాక అనూరాధ ,మాజీ జెడ్పిటీసీ విజేతా రెడ్డి ,టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు ,టీడీపీ డివిజన్ ఇంచార్జిలు పాల్గొన్నారు .