మన న్యూస్ ,నెల్లూరు ,మే 19: *టిడిపి,జనసేన ల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 100 కుటుంబాలు. *వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే.. ప్రజలకు సముచిత న్యాయమని విశ్వాసం వ్యక్తం చేసిన కార్యకర్తలు.నెల్లూరు రాంజీ నగర్ వైసిపి ఆఫీసులో సోమవారం జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షులు మరియు 48 డివిజన్ ఇంచార్జ్ షేక్ సిద్దిక్ ఆధ్వర్యంలో టిడిపి, జనసేన పార్టీ ల నుంచి ఆబిద్ టీమ్.. 100 కుటుంబాలు ..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని కలిసి... వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు . ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని.. పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.......... ఈరోజు సిద్ధిక్ ఆధ్వర్యంలో టిడిపి జనసేన లను వీడి .. 100 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం..సంతోషకరమన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలల్లో లభిస్తున్న ఆదరణకు ఇది సంకేతమన్నారు.కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వలన ఆ పార్టీ.. 11 నెలలోనే ప్రజాగ్రహానికి గురైందన్నారు. అబద్ధపు హామీలు ఇచ్చి.. మోసపు మాటలతో ఈరోజు చంద్రబాబు ప్రజల్ని నిలువునా దగా చేశారని ఆరోపించారు.ఈరోజు . వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని మరో సారి ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న.. ఆకాంక్ష ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకి.. రాబోయే రోజుల్లో సముచిత గౌరవం కల్పిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో 42వ డివిజన్ కార్పొరేటర్ కరిముల్లా, వైసిపి నాయకులు రఫీ భాయ్,జిల్లా యక్టివిటీ సెక్రటరీ జహీద్, వైసీపీ సీనియర్ నాయకులు ఖజానా వెంకట శేషయ్య ఆచారి, బెల్లంకొండ వాణి,ముని కృష్ణ, మున్నా, సాబీర్, రబ్బు, ఇంతియాజ్, నాయబ్, అస్లాం తదితరులు పాల్గొన్నారు.