గొల్లప్రోలు మే 18 మన న్యూస్ :- గేట్ 2025లో అత్యుత్తమ ప్రతిభ కనపరచి 111 వ ర్యాంకు సాధించిన కందా చల్లారావు ను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి యస్ వి యస్ యన్ వర్మ అభినందించారు.పిఠాపురం తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో చల్లారావు కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్మ కందా కు శాలువ కప్పి అభినందనందించారు.ఈసందర్బంగా వర్మ మాట్లాడుతూ అఖిలభారత స్థాయిలో ర్యాంకు సాధించి పిఠాపురం నియోజకవర్గానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొని రావడం సంతోషంగా ఉందన్నారు.మెటలర్జికల్ ఇంజనీరింగ్ లో 100 మార్కులకు గాను 66 మార్కులు సాధించడం ద్వారా వన్నెపూడి గ్రామానికి, తను చదివిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు పేరు తీసుకు వచ్చి నట్లు సర్పంచ్ కందా సుబ్రహ్మణ్యం తెలిపారు.ప్రస్తుతం మద్రాసు ఐఐటీ లో చదువుతున్న చల్లారావు జడ్పీ ఉన్నత పాఠశాల లో పదవతరగతి లో 9.7 గ్రేడ్ సాధించినట్లు తెలిపారు.చల్లారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉద్యోగం పొందేందుకు సాధన చేస్తు గేట్ పరీక్ష రాసినట్లు తెలిపారు.గత ఏడాది 277 ర్యాంకు వచ్చినట్లు చల్లారావు వివరించారు.చల్లారావు తండ్రి దత్తాత్రేయుడు తల్లి వరలక్ష్మి ని పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామాస్తులు చల్లారావు ని అభినందించారు.