మన న్యూస్, పొదలకూరు, మే 19 :తోడేరు అబ్బాయి చాలా బుద్ధిమంతుడంట.బెయిల్ కోసం ఏకంగా సుప్రీంకోర్టుకే మస్కా కొట్టే యత్నం అని పొదలకూరు మండలం మరుపూరు పర్యటన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.మరుపూరులో నిర్మాణం పూర్తయిన సిమెంట్ రోడ్లకు ప్రారంభోత్సవం...అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.........మన తోడేరు అబ్బాయి కాకాణి ఖ్యాతి జిల్లా, రాష్ట్రం పరిధి దాటి సుప్రీం కోర్టు స్థాయికి చేరింది అని అన్నారు.బెయిల్ కోసం ఏకంగా సుప్రీంకోర్టునే తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు అని అన్నారు.తనకు ఎలాంటి నేరచరిత్ర లేదని, ఇప్పటి వరకు తనపై ఎలాంటి కేసులు నమోదు కాలేదని నమ్మించేందుకు యత్నించాడు అని అన్నారు.2024 ఎన్నికల సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్ ను ప్రభుత్వ న్యాయవాది కోర్టు ముందుంచడంతో అబ్బాయి చరిత్ర చూసి సుప్రీంకోర్టు ఫైర్ అయింది అని అన్నారు.చివరకు పిటీషన్ విత్ డ్రా చేసుకుంటామని బతిమలాడినా ఒప్పుకోకుండా డిస్మిస్ చేసింది అని అన్నారు.జిల్లా కోర్టు, ఆర్డీఓ ఆఫీసులో ఫైళ్లు లేపేసిన అనుభవంతోనే సుప్రీంకోర్టులోనూ ఒక ట్రయల్ వేసినట్టున్నారు అని అన్నారు.తోడేరు అబ్బాయి చేసిన పాపాలు ఒకటా..రెండా..చెప్పుకుంటూ పోతే కొండవీటి చేంతాడంత.. అని అన్నారు.ఇన్ కం ట్యాక్స్ కట్టే కోటీశ్వరులైన రావుల అంకయ్య గౌడ్ కుటుంబానికి మరుపూరులో 57 ఎకరాలు దారాదత్తం చేశారు అని అన్నారు.మరుపూరుకి చెందిన మరో నిరుపేద గోపాలరెడ్డికి 27 ఎకరాల భూములను అప్పగిస్తూ రికార్డులు మార్చేశారు అని అన్నారు.కాకాణికి సేవ చేశారని ఈ విధంగా రుణం తీర్చుకుంటారా అని అన్నారు.వైసీపీ పాలనలో తహసీల్దార్లు వీరవసంతరావు, స్వాతి అడ్డంగా సంతకాలు పెట్టేశారు అని తెలిపారు.గత ఏడాది ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే కొద్ది గంటల ముందే కృష్ణపట్నం పోర్టు రోడ్డులో అల్లుడికి 57 ఎకరాలు సంతర్పణ చేస్తూ అర్థరాత్రి కాకాణి జీఓ ఇప్పించాడు..ఆ అల్లుడు కూడా నిరుపేదే అని అన్నారు. మనుబోలు మండలంలో జాతీయ రహదారి పక్కనే 19 ఎకరాలను చెరపట్టారు అని అన్నారు.ఒక్క భూములే కాదు గ్రావెల్, ఇసుక, మట్టి, క్వార్జ్ట్ దేనినీ వదిలిపెట్టకుండా దోపిడీకి పాల్పడ్డారు అని అన్నారు.వరదాపురంలో క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ తో వందల కోట్లు ఇష్టారాజ్యంగా దోచేశాడు అని అన్నారు.నేను మైన్ లోకి వెళ్లి అక్రమ మైనింగ్ విషయాన్ని ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చాను...కలెక్టర్ నుంచి పీఎం వరకూ అందరికీ ఫిర్యాదులు పంపాను అని అన్నారు.ఇల్లీగల్ మైనింగ్ ఆపాలని హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది..అయినా లెక్క చేయక క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కొనసాగించారు అని అన్నారు.గిరిజనుల ప్రాణాలను పణంగా పెట్టి భారీ పేలుళ్లలతో క్వార్ట్జ్ మైనింగ్ చేశారు అని అన్నారు.అక్కడి భయానక పరిస్థితులను చూసి అప్పటికప్పుడే సత్యాగ్రహ దీక్ష చేపట్టాను అని అన్నారు.అక్రమ మైనింగ్ కు అడ్డుగా నిలిచిన నాపైకి వందల మంది హిజ్రాలను, రౌడీలను ఉసిగొల్పాడు అని అన్నారు.ఒక రాజకీయ ప్రత్యర్థి చేస్తున్న పోరాటంపైకి హిజ్రాలను పంపిన ఏకైక వ్యక్తిగా గోవర్ధన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారేమో అని అన్నారు.40 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్నా...కాకాణిలా దుర్మార్గమైన భాష మాట్లాడే నాయకుడిని ఇప్పటి వరకు చూడలేదు అని తెలిపారు.వైసీపీ పాలనలో లెక్కకు మించి చేసిన పాపాలే కాకాణి గోవర్ధన్ రెడ్డికి శాపాలుగా మారాయి అని అన్నారు.