తిరుపతి, Mana News : మోహన్ బాబు ప్రైవేట్ యూనివర్సిటీకి చెందిన దళిత విద్యార్థి జేమ్స్ (మాల) ని కిడ్నాప్ చేసి, దారుణంగా కొట్టి, నోట్లో మూత్రం పోసి అవమానించిన అగ్రకుల రౌడీ షీటర్లు మరియు కొంతమంది విద్యార్థుల పై కఠిన చర్యలు తీసుకోవాలని మాదిగ మహాసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నందిపాక అంజనాద్రి డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన అంజనాద్రి, కులం పేరుతో దళిత విద్యార్థిని ఉద్దేశ్యపూర్వకంగా అవమానించడం అత్యంత పాశవిక చర్యగా పేర్కొన్నారు. సంఘటనలో భాగంగా పాల్గొన్న ప్రతి ఒక్కరినీ రాజకీయ ఒత్తిళ్లకు లోనవకుండా వెంటనే అరెస్ట్ చేసి, చట్టపరంగా కఠిన శిక్షలు విధించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.దళితులపై పెరిగిపోతున్న దాడులను కట్టడి చేయకపోతే తీవ్రంగా ఎదుర్కొవలసి వస్తుందని హెచ్చరించిన అంజనాద్రి, ఈ ఘటన సామాజిక న్యాయంపై పెద్ద ప్రశ్నార్థకం వేసిందన్నారు.