మన న్యూస్ ,నెల్లూరు, మే 19: తీవ్రంగా గాయపడి నెల్లూరు షైన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తిరుపతికి చెందిన దళిత విద్యార్థి జేమ్స్ ను జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున అలాగే విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి పరామర్శించారు.అనంతరం నెల్లూరు విఆర్సి సెంటర్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి.. జేమ్స్ పై దాడిని వ్యతిరేకిస్తూ నిరసన.. తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్సిపి జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆశ్రిత రెడ్డి లు అన్నారు.జేమ్స్ పై దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.అత్యంత పాశవికంగా దళిత విద్యార్థి జేమ్స్ పై దాడి జరిగిందని.. ఇది ఒక అమానుష చర్య అన్నారు.దాడుల సంస్కృతి మంచిది కాదని.. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా.. ప్రజలకు ప్రభుత్వం భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ 11 నెలల పాలనలో ప్రజలపై దాడులు దౌర్జన్యాలే తప్ప అభివృద్ధి, సంక్షేమం శూన్యం..అన్నారు. ఎప్పుడు ఎవరి మీద ఏ పక్క నుంచి దాడి జరుగుతుందా అన్న.. అభద్రతాభావం లో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు.ఇలాంటి దాడులు పునరావృతమైతే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలిచి ఉద్యమ బాట పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు, విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు.