మన న్యూస్ ,నెల్లూరు ,మే 18:నెల్లూరు గోమతి నగర్ లో మంత్రి క్యాంప్ ఆఫీసులో ఆదివారం మినీ మహానాడు నిర్వహించారు . ఈ మినీ మహానాడుకు నగర నలుమూలల నుంచి తరలివచ్చిన టీడీపీకార్యకర్తలు ,నాయకులు ,అభిమానుల తో కొలహాలంగా జరిగింది.పసుపుమయం గా మారిన మినీ మహానాడు ప్రాంగణం ..తెలుగుతమ్ముళ్లలో నూతన జోష్ కనిపించింది.పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన మంత్రి నారాయణ .జ్యోతిప్రజ్వలన చేసి పార్టీ జెండా ఆవిష్కరించిన మంత్రి .మినీ మహానాడులో అభివృద్ధి పనులపై ఏడు ప్రతిపాదనలు చేసిన టీడీపీ నేతలు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ.........కార్యకర్తల శ్రమతోనే టీడీపీ గెలుపు సాధ్యమైంది .చరిత్రలో నిలిచిపోయేలా మా నాన్నను అఖండ మెజారిటీతో సిటీ వాసులు గెలిపించారు .అందరి సహకారంతో మా నాన్న నారాయణ నెల్లూరు ను స్మార్ట్ సిటీ గా మారుస్తారు అని మంత్ర కుమార్తె అన్నారు.ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారు .చంద్రబాబు పాలనలో సింహపురికి మంచిరోజులు వచ్చాయి అన్నారు. కార్యకర్తలకు మా కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుంది అన్నారు.డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ....అందరూ హామీలిస్తారు ,అవసరం తీరాక గాలికి వదిలేస్తారు అని అన్నారు.అందగానిలిచిన కార్యకర్తలకు సంవత్సరానికి పదికోట్ల సొంత నిధులు ఇస్తున్న గొప్ప వ్యక్తి నారాయణ అని అన్నారు.కార్యకర్తలు ఆర్ధికంగా ఎదిగేందుకు మంత్రి నారాయణ కృషి చేస్తున్నారు అని అన్నారు.నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ....నారాయణ తో నాకు 30 ఏళ్ల పరిచయం ఉంది .అయన ఇంత గొప్ప నాయకులు అవుతారని అనుకోలేదు అని అన్నారు.ప్రజోపయోగమైన నిర్ణయాలతో జనం గుండెల్లో మంత్రి పదిలమైన స్థానం సంపాదించారు అని అన్నారు.రాష్ట్రాన్ని దోచుకొని వైఎస్సార్సీపీ అప్పుల పాలు చేసి వెళ్ళింది అని అన్నారు.రాష్ట్రానికి ఇప్పుడు సీఎం చంద్రబాబు ఆపద్బాంధవుడిగా మారారు అని అన్నారు.అయన పాలనలో అన్ని వ్యవస్థలూ గాడిన పడతాయి అని అన్నారు.రాష్ట్ర వక్స్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ.....కార్యకర్తలంటే మంత్రి నారాయణకు సైనికులతో సమానం అని అన్నారు.పనిచేయించుకొని వదిలేసే రకం కాదు మంత్రి నారాయణ అని అన్నారు.కుటుంబసభ్యులుగా భావించి అండగా నిలబడే రకం మంత్రి నారాయణ అని అన్నారు.అందుకే మంత్రి అంటే కార్యకర్తలకు అలివిగాని అభిమానం అని అన్నారు.అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ మంత్రి నారాయణ సార్ ,ప్రజాసమస్యల కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న ఏకైక నేత మంత్రి నారాయణ అని అన్నారు.రాజకీయాల్లో మంత్రి నడవడిక చూసి చాలా నేర్చుకున్నా ,నారాయణ సార్ మంత్రి కావటం రాష్ట్రానికే అదృష్టం అని అన్నారు.రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ...........క్రమశిక్షణకు టీడీపీ మారుపేరు ,మినీ మహానాడులో చేసిన ప్రతిపాదనలన్నీ అమలు చేస్తా అని అన్నారు.2014 లో నెల్లూరు సిటీ లో 5250 కోట్లతో అభివృద్ధి పనులు చేసాము అని తెలిపారు.2019 లో దురదృష్ట వశాత్తు టీడీపీ ఓడిపోయింది ,2024 ఎన్నికల్లో సిటీ నియోజకవర్గంలో 84 వేల ఇళ్ళు తిరిగా అని అన్నారు.అప్పుడే ప్రజాసమస్యల గురించి తెలుసుకున్నా ,ప్రజల జీవనశైలి ని చూసి అర్ధం చేసుకొన్నాను అని అన్నారు.పేదల పరిస్థితి చూసి చలించిపోయా ,పేదరికం నుంచి వచ్చిన నాకు ఆ ఇబ్బందులు ఎలా ఉంటాయో తెలుసు అని అన్నారు.ప్రభుత్వం తో పాటు నా వొంతు సహాయం చేయాలని భావించా, అనుకున్నట్టుగానే ముందుకు సాగుతున్నా అని అన్నారు.2014 -19 లో టిడ్కో ఇళ్ళు ,అన్నా కాంటీన్ ల ఏర్పాటు నాకు సంతృప్తి కలిగించింది అని అన్నారు.ఏళ్లతరబడి పరిష్కారంకాని భగత్ సింగ్ కాలనీ వాసులకు శాశ్వత పట్టాలు ఇప్పించటం సంతోషాన్ని ఇస్తోంది అని అన్నారు.సిటీలో 5 వేల మందికి ఇంటిపట్టాల సమస్య పరిష్కరిస్తాము ,ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా ప్రతీ ఇంటికి రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తాము అని అన్నారు.15 కోట్లతో వీఆర్ సీ హై స్కూల్ ను దేశంలోనే మోడల్ గా తీర్చిదిద్దుతాము అని అన్నారు.నిరుపేద పిల్లలకు వీఆర్ సీ లో అడ్మిషన్స్ కల్పిస్తాను ,సిటీలో ఏర్పాటు కానున్న ఎంఎస్ఎం ఈ పార్కుద్వారా 5 వేల మందికి ఉపాధి కల్పిస్తాము అని అన్నారు.52 కోట్లతో పంటకాలువల ఆధునీకరన చేస్తాము ,175 కోట్లతో జాఫర్ సాహెబ్, సర్వేపల్లి కాలువల్లో పూడికతీత పనులు చేపడతాము అని అన్నారు.అమృత్ పథకం ద్వారా ప్రతీ ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇస్తాము అని అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్పెర్సన్ అనూరాధ ,మాజీ జెడ్పిటిసీ విజేతా రెడ్డి .సిటీ టీడీపీ అధ్యక్షులు మామిడాల మధు ,రాష్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు ,కార్పొరేటర్లు ,నాయకులు ,ప్రెసిడెంట్లు ,కోఆర్డి నేటర్లు పాల్గొన్నారు .