మన న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు నుండి సాంబయ్య గూడెం, బయ్యారం, మంగపేట ఏటూర్ నాగారం ఆర్ అండ్ బి ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంశమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు మాత్రం తామేమి ఎరుగునట్లు ప్రవర్తిస్తున్నారని మణుగూరు సామాజిక కార్యకర్త కర్నె రవి ఆరోపణలు చేశారు. పలుమార్లు జిల్లా ఆర్ అండ్ బి అధికారులకు, జిల్లా కలెక్టర్ కు ఎన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని, ప్రజల ప్రాణాలంటే వారికి లెక్కలేకుండా పోయిందని విమర్శించారు. అధికారులు వారు తీసుకుంటున్న జీతాల మీద తప్ప, ప్రజల ప్రాణాలపై శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. వాహనదారుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని సత్వరమే మణుగూరు, ఏటురునాగారం ప్రధాన రహదారిని బాగు చేయాలని, లేని పక్షంలో ఆర్ అండ్ బి శాఖ మంత్రి, ముఖ్యమంత్రి దృష్టికి విషయాన్ని తీసుకెళ్తామని ఆయన అన్నారు.