మన న్యూస్ ,నెల్లూరు రూరల్ ,మే 18: *నెల్లూరులో కెవిఆర్ పెట్రోల్ బంక్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు సాగిన తిరంగా ర్యాలి.*వేలాదిగా తరలి వచ్చి స్వఛ్ఛందంగా ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ సంబరాలలో పాల్గొన్న ప్రజలు. *వందేమాతరం, భారత్ మాతాకి జై నినాదాలతో ప్రతిధ్వనించాయి. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకొని మువ్వన్నెల పతాకాలు చేతబట్టి ఆదివారం కెవిఆర్ పెట్రోల్ బంక్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు సాగిన తిరంగా ర్యాలిలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని దేశభక్తిని చాటారు.ఈ సందర్భంగా దేశ రక్షణలో అమరులైన సైనికుల త్యాగాలను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కొనియాడారు. మరోసారి తోక జాడిస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ కనపడదు అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా మాతృభూమి రక్షణలో అశువులు బాసిన తెలుగు వీరుడు మురళి నాయక్ కు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నివాళులర్పించారు.ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాలలో పాల్గొన్న ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలియజేశారు.