నెల్లూరు నగర నియోజకవర్గ కార్యకర్తలు సైనికులా పనిచేస్తున్నారు........ ఏపీ వక్స్ బోర్డ్ చైర్మన్ మరియు నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్
మన న్యూస్ ,నెల్లూరు ,మే 18:*నెల్లూరు నగర నియోజకవర్గంలో కార్యకర్తల కష్టం ఎప్పటికీ వృధా పోదు.*23 న వీపీఆర్ కన్వెన్షన్ లో జరిగే పార్లమెంట్ మహానాడు లో అందరూ పాల్గొనండి.*షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు.నెల్లూరు నగర నియోజకవర్గ కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తున్నారని ఆ పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. నెల్లూరు నగరంలోని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఉదయం జరిగిన నియోజకవర్గ మినీ మహానాడు లో నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి లతో కలిసి పాల్గొన్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నేతలు అందరూ కలిసి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళి అర్పించి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పహల్గాం దాడిలో, ఆపరేషన్ సిందూర్ లో చనిపోయిన అమాయకులు, జవాన్ లకు, ఇటీవల కాలంలో మృతి చెందిన పార్టీ కార్యకర్తలకు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ......మహానాడులో అనేక తీర్మానాలను ప్రతిపాదించారని, ప్రతిపాదించిన తీర్మానాలకు వందరెట్లు అధికంగా చేయాలని నారాయణ మనసులో ఉందని అన్నారు. కుటుంబంతో సమానంగా కార్యకర్తలను చూసుకుంటున్న వ్యక్తి నారాయణ అని పేర్కొన్నారు. నారాయణ కార్యకర్తలకు చేసే సహాయం కుల మతాలను చూసి చేయడం లేదని చేసే పనిని బట్టి చేస్తున్నారని అన్నారు. నెల్లూరు నగరంలో కార్యకర్తల కష్టం ఎప్పటికీ వృధా పోదని అన్నారు. కార్యకర్తలకు మంత్రి నారాయణ అండగా ఉన్నారని, కార్యకర్తలు ధైర్యంగా ఉండొచ్చని తెలిపారు. నారాయణ దగ్గర నుంచి తాను చాలా విషయాలు నేర్చుకున్నానని రాజకీయాల్లో అరుదైన వ్యక్తి నారాయణ అని అన్నారు. ఈనెల 23న విపిఆర్ కన్వెన్షన్ హాల్ నందు నెల్లూరు పార్లమెంట్ మినీ మహానాడు జరగనుందని కార్యక్రమానికి నెల్లూరు నగర నియోజకవర్గ కార్యకర్తలు అందరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్లపాక అనురాధ, డిప్యూటీ మేయర్ లు రూప్ కుమార్ యాదవ్, సయ్యద్ తహసీన్, నగర పార్టీ అధ్యక్షుడు మామిడాల మధు తదితరులు పాల్గొన్నారు.