మన న్యూస్ ,ముత్తుకూరు, మే 17:*యుద్ధం కొనసాగితే నామరూపాలు కోల్పోతామనే పాక్ కాళ్లబేరం."ఆపరేషన్ సింధూర్ విజయంతో హీరోగా ప్రధానమంత్రి మోదీ. ముత్తుకూరులో శనివారం నిర్వహించిన తిరంగా ర్యాలీలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ........ఆపరేషన్ సింధూర్ విజయాన్ని కీర్తిస్తూ నిర్వహించిన ర్యాలీకి ప్రజల నుంచి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉంది అని అన్నారు.టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో పాటు ఈ తిరంగా యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలియజేశారు.పెహల్గామ్ లో ఉగ్రవాదులు మతం పేరు అడిగి భార్యాబిడ్డల ఎదుటే హిందువులను దారుణంగా హతమార్చారు అని అన్నారు.మన కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ కూడా ఉగ్ర తూటాలకు బలయ్యాడు అని అన్నారు.ప్రతి భారతీయుడి గుండె తరుక్కుపోయే ఘటన అది అని అన్నారు.యుద్ధాలు జరుగుతుంటాయి..బాంబులు వేస్తుంటారు..కానీ మతం పేరు అడిగి ప్రాణాలు తీయడం ఇదే తొలిసారేమో అని అన్నారు.పాక్ ఉగ్రవాదుల దుశ్చర్యపై ఆపరేషన్ సింధూర్ తో భారతదేశం సత్తా చాటింది అని అన్నారు.తెలుగు సైనికుడు మురళీ నాయక్ పాకిస్థాన్ సైన్యంతో పోరాడుతూ అమరుడయ్యాడు అని అన్నారు.లక్షలాది మంది సైనికులు తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ మన కోసం సరిహద్దులో ప్రాణాలొడ్డి పోరాడుతున్నారు అని తెలిపారు.త్రివిధ దళాలకు దేశమంతా అండగా ఉంది..వారికి మన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అని అన్నారు.ఆపరేషన్ సింధూర్ తో భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పి నరేంద్ర మోదీ హీరోగా నిలిచారు అని తెలియజేశారు.భారతదేశం జోలికొస్తే తాట తీస్తామని హెచ్చరికను శత్రుదేశంతో పాటు ఉగ్రవాదులకు పంపారు అని అన్నారు.పాకిస్థాన్ లో 9 ఉగ్రవాద స్థావరాలను మన సైన్యం ధ్వంసం చేసి ముష్కరులను మట్టుబెట్టింది అని అన్నారు.ఎస్400 సిస్టమ్ ను యాక్టివేట్ చేసి సుమారు 400కి పైగా పాక్ డ్రోన్లను గాలిలోనే పేల్చేసింది అని అన్నారు.బ్రహ్మోస్ క్షిపణులతో పాకిస్థాన్ గడగడలాడింది అని అన్నారు.మరో 48 గంటలు యుద్ధం కొనసాగివుంటే పాకిస్థాన్ లోని ఎయిర్ బేస్ లు మొత్తం ధ్వంసమయ్యేవి అని అన్నారు.ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది అని అన్నారు.టెర్రరిస్టులను పోషించే తమకు ఈ గతి పట్టిందని ఆ దేశ సైనికాధికారులు తలలు బాదుకుంటున్నారు అని అన్నారు. భారతదేశమంతా ఐకమత్యంగా ఉంది..కులమతాలకు అతీతంగా ఒకే తాటిపై నడుస్తాం అని తెలిపారు.
i