మన న్యూస్ ,నెల్లూరు, మే 18:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరియు శ్రీ పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి తన ప్రాణాలను అర్పించి చరిత్రలో అమరుడిగా నిలిచిన మహనీయుడు, అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నెల్లూరు స్టౌన్ హౌస్ పేటలోని SBS కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ...........అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పోరాటాలు త్యాగాలను స్మరించుకుంటూ వారి జ్ఞాపకాలు గుర్తుచేస్తూ నేటి యువతరం వారి యొక్క అడుగు జాడల్లో నడవాలి అని గుర్తు చేసుకున్నాం అని అన్నారు.ఆంధ్రులకు భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, ఆశయాల కొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు అని అన్నారు.ఈ సందర్భంగా మహనీయుని త్యాగాలను, సత్యం-అహింసను పరిరక్షించేందుకు చేసిన నిరాహార దీక్షను స్మరించుకుంటూ, ఆయన చిత్రపటానికి పుష్పాంజలులు ఘటించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ , మంత్రివర్యులు పొంగూరు నారాయణ తదితరులు ఈ కార్యక్రమానికి విజయవంతంగా నిర్వహించారు.