మన న్యూస్, ఆత్మకూరు ,మే 18:దేశభక్తికి ప్రతీకగా.. ఆదివారం ఆత్మకూరు చరిత్రలో నిలిచేలా తిరంగా యాత్రను ప్రారంభించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి . ఈ సందర్భంగా మాట్లాడుతూ.......భారతదేశం కోసం ప్రాణాలర్పించిన యుద్ధ వీరుడు మురళీ నాయక్ కు జోహార్లు అర్పిస్తూ తిరంగా యాత్రలో ముందుకుసాగిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. వేలాదిగా తరలివచ్చిన ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు, యువత, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అధికారులు, పార్టీలకు అతీతంగా... అందరి జెండా ఒకటే జాతీయ జెండా... మనమంతా ఒకటే అందరూ భారతీయులనే దేశభక్తి ఉప్పొంగేలా భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడిస్తూ..... కొనసాగిన తిరంగా యాత్ర .ప్రతి ఒక్కరూ త్రివర్ణ పతాకాలు చేతబట్టి ముందుకుసాగగా...భారత్ మాతాకీ జై... వందేమాతరం నినాదాలతో మారుమోగిన ఆత్మకూరు పట్టణం. ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం నుంచి సోమశిలరోడ్డు, బిఎస్ఆర్ సెంటర్, బస్టాండు మీదుగా సత్రం సెంటర్ వరకు తిరంగా యాత్ర. ఉగ్రవాదులపై విరోచితంగా పోరాడిన సైనికులకు యావత్ భారతదేశం అండగా వుంటుందనే భరోసా ఇస్తూ దేశ ఔన్నత్యాన్ని... భారతీయుల ఐక్యమత్యాన్ని చాటుతూ కొనసాగిన తిరంగా యాత్ర.