మన న్యూస్, నెల్లూరు ,మే 18: గాయపడి చికిత్స పొందుతున్న తిరుపతి విద్యానికేతన్ దళిత విద్యార్థి జేమ్స్ ను నెల్లూరులోని షైన్ హాస్పిటల్లో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు.జేమ్స్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని.. వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కోరారు. ఈ సందర్బంగా పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ........దళిత విద్యార్థి జేమ్స్ ను .. అత్యంత దారుణంగా గాయపరచడం దుర్మార్గమన్నారు.జేమ్స్ పై దాడి ఘటన విషయాన్ని.. వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుసుకొని.. వెంటనే బాధితుడిని పరామర్శించి.. మెరుగైన వైద్యం అందిలా సహాయపడాలని ఆదేశించడంతో.. జేమ్స్ పరామర్శించి.. వైద్యులతో మాట్లాడడం జరిగిందన్నారు.కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇలాంటి దాడులు అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా జరుగుతున్నాయన్నారు. బయట తిరుగుతున్న ప్రజలెవ్వరికి రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.జేమ్స్ పై దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఇలాంటి దాడులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించబోదని.. ఇలాంటి ఘటనలు పునరావృతమయితే.. కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఘాటుగా హెచ్చరించారు.