మన న్యూస్ ,నెల్లూరు రూరల్, మే17:నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్ కావేరి అవెన్యూలో 33 లక్షల రూపాయలు వ్యయంతో సిసి రోడ్డు, సిసి డ్రైన్ కు శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.25 రోజుల్లో రోడ్డు, డ్రైన్ వేగవంతంగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.ఎన్నికలు లేని వేళ పార్టీ జెండాలు పక్కనపెట్టి స్థానిక ప్రజా సమస్యల పరిష్కారం కోసం, అభివృద్దే ద్యేయంగా పని చేద్దాం అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.నెల్లూరు రూరల్ కు ఎంత చేసినా తక్కువే, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రోత్సాహంతో అధికారుల సహకారంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో కనీస వసతుల కల్పనకు స్థానిక ఎమ్మెల్యేగా కృషి చేస్తా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ చేజర్ల మహేష్ బాబు, 20వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు దారా మల్లి, టిడిపి నాయకులు ఖాదర్ బాషా, రవీందర్ రెడ్డి, ఆరుగుంట పిచ్చి రెడ్డి, తాళ్లూరు సురేష్, దువ్వూరు భాస్కర్ రెడ్డి, పోతురాజు రవి, మాస శ్రీనివాసులు, పెనబాక దిలీప్ రెడ్డి, మోపూరు శ్రీధర్ రెడ్డి, మధు గౌడ్, సురేంద్ర నాయుడు, శ్రీనివాసులురెడ్డి, సునీల్ రెడ్డి, శేఖర్ రెడ్డి, కొండ కోటిరెడ్డి, సమాధి సతీష్ యాదవ్, గంట డేవిడ్, నాటకరాని నవీన్, డేవిడ్ రాజా, కుంభం కిష్టయ్య, బొమ్మన సీనయ్య, నారాయణ, నాదముని, రత్నం, బత్తల హరి, దార దయాకర్, విజయ్ కుమార్, తూపిలి ప్రభాకర్ రావు, దిండు మధు,హెచ్.ఎస్.రెడ్డి, విష్ణు, వెంకటేష్, రంజిత్, చేజర్ల కవిత, శాంతి, అల్లం లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.