Mana News:- సాలూరు నవంబర్19( మన న్యూస్):= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో కల్తీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పు అని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాబర్ట్ ఫాల్ హెచ్చరించారు. సాలూరులో ఉన్న అగ్రి ల్యాబ్ లో మంగళవారం రైతులతో పాటు వివిధవిత్తనాల సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా రైతులు అనేక సమస్యలను ఉన్నత అధికారులు దృష్టికి తెచ్చారు. రైతులకు విత్తనాలు ఇచ్చే ముందు ఆ విత్తనాలు సంస్థల ప్రతినిధులు ఎం ఓ యూ లు చేసుకోవాలని పంటకు నష్టం వాటిలితే విత్తన సంస్థలు తప్పకుండా నష్ట పరిహారం చెల్లించాలని అన్నారు. రైతులపై రుబాబు చేస్తే సహించేది లేదని అన్నారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో వచ్చి సమస్యలు పరిష్కారంలో భాగంగా ఈ సమావేశం నిర్వహించటం జరిగిందని అన్నారు. మొక్కజొన్న విత్తనాలకు సంబంధించి మక్కువ మండలంలో 42 మంది రైతులకు,పాచిపెంట మండలంలో18.8 ఎకరాలకు సంబంధించిన రైతులకు నష్టపరిహారం కు సంబంధించి ఆయా కంపెనీలు ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది అని అన్నారు.రైతులు వివిధ కంపెనీల విత్తనాలు నాటేటప్పుడు తప్పకుండా ఎం ఓ యూలు చేసుకోవాలని అన్నారు. ఆయనతో పాటు ఏడి మధుసూదన్ రావు, పాచిపెంట ఏ ఓ.తిరుపతిరావు, సాలూరు ఏ ఓ అనురాధ పండ, వ్యవసాయ శాఖ కి సంబంధించిన సిబ్బందులు పాల్గొన్నారు.