మన న్యూస్ సింగరాయకొండ:-
పరిసరాలు పరిశుభ్రత సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత
ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి
వేసవి దృష్ట్యా ప్రజలు చల్లని నీరు, మజ్జిగ ఎక్కువగా త్రాగాలి
మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
పరిసరాలు పరిశుభ్రత సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శనివారం నాడు ప్రకాశం జిల్లా జరుగుమల్లిలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెడికల్ క్యాంప్, చలివేంద్రంను ప్రారంభించారు. అనంతరం మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ…… మన చుట్టూ పరిసరాలు మనమే శుభ్రపరుచుకోవాలి పరిసరాల పరిశుభ్రత సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత. గ్రామంలో సైడ్ కాలవలు డ్రైన్లు శానిటేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి. ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి. చెట్లు,అడవులను సంరక్షించాలి. ప్రస్తుతం వేసవి దృష్ట్యా ప్రజలు చల్లని నీరు, మజ్జిగ ఎక్కువగా త్రాగాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పొలాల్లో నీటి తొట్లు ఏర్పాటు చేసి ప్రభుత్వం పశువులకూ నీరందిస్తోంది. స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు స్వచ్ఛందంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీర్చేందుకు ముందుకు రావాలని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పిలుపునిచ్చారు.