మన న్యూస్ ,వాకాడు, మే 17: వైయస్సార్ కాంగ్రెస్ బలోపేతంకు వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తెలిపారు. వాకాడు లోని నేదురుమల్లి నివాసం లో వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ని శనివారం వాకాడు, చిట్టమూరు, కోట మండలాలకు చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు,మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులతో స్థానిక రాజకీయలను గురించి సమీక్షించారు. అనంతరం నేదురుమల్లి మాట్లాడుతూ......... భారతదేశ వ్యూహాత్మక సత్తాను ఆపరేషన్ సిందూర్ ప్రపంచానికి చాటి చెప్పిందని తెలిపారు. పాకిస్తాన్ తో జరిగిన యుద్ధం విజయవంతానికి ప్రధానమంత్రి మోదీ దృఢ సంకల్పం, కచ్చితమైన, సకాలంలో అందిన ఇంటెలిజెన్స్ సమాచారం, భారత సాయుధ బలగాల సత్తా కారణాలని ప్రశంసించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంలో ముఖ్యపాత్ర పోషించిన ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ తెలియజేశారు. ఇక 2027 జెమిలి ఎన్నికలు రావడం తద్యమని, ఆ ఎన్నికలకు వైఎస్ఆర్సి మద్దతు ఇస్తుందని చెప్పారు. 2027 జరిగే ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. వైఎస్ఆర్సిపి శ్రేణులు పార్టీ అభ్యున్నతి కొరకు ప్రతి ఒక్కరు కృషి చేసి వైయస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని సూచించారు.