మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం
సింగరాయకొండ మండల విద్యా వనరుల కేంద్రంలో మండల విద్యాశాఖ అధికారి కత్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచాలని, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శనంలో “స్వచ్ఛత సేవ” కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.అనంతరం ఉపాధ్యాయులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. మొక్కలకు నీరు పోసి, స్వచ్ఛ ఆంధ్రకు సంబంధించిన నినాదాలు చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు, అంబటి బ్రహ్మయ్య, పూర్ణచంద్రరావు, రామకృష్ణారెడ్డి, జంషీర్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.