మన న్యూస్, నెల్లూరు ,మే 17:నెల్లూరు లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూటమి ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టారు.ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అక్రమ అరెస్టులను ఖండించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగడమే పనిగా పెట్టుకుందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రజలకు అనేక హామీలు గుప్పించి మభ్యపెట్టిందన్నారు. ఈరోజు ఆ హామీలు అమలు ఊసే కనిపించడం లేదన్నారు.ఉపాధ్యాయులు ఉద్యోగులు, ఎవ్వరు కూడా కూటమి ప్రభుత్వ విధానాల పట్ల సంతృప్తిగా లేరని అన్నారు. ఎక్కడ అభివృద్ధి పనులు కూడా జరగడం లేదన్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే ప్రభుత్వం ఒక లక్షా 10 వేల కోట్ల రూపాయల అప్పులు చేసి.. ఇలా అప్పు చేసిన సొమ్మునంత కాంట్రాక్టర్ల చేత దొంగ బిల్లులు పెట్టించి.. కమిషన్లు దండుకుంటుందని ఆరోపించారు.దీంతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోతుందన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ప్రశ్నించిన.. వైఎస్ఆర్సిపి నేతలపై అక్రమ కేసులు బనాయించడం.. వారిపై దౌర్జన్యాలు, దాడులకు దిగడం పరిపాటిగా మారిదన్నారు. ప్రస్తుతం మరో అడుగు ముందుకు వేసి ఐ ఏ యస్ అధికారులపై కూడా కేసులు పెట్టే.. నీచ సంస్కృతిని కూటమి ప్రభుత్వం ప్రోత్సహించడం దుర్మార్గమన్నారు. అందులో భాగంగానే గత ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా వ్యవహరించిన ధనుంజయ రెడ్డి ని, అలాగే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి ఓఎస్డిగా వ్యవహరించిన కృష్ణమోహన్ రెడ్డి ని.. అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం అత్యంత దారుణమైన విషయం అన్నారు. గత ప్రభుత్వంలో అత్యంత పారదర్శకంగా జరిగిన లిక్కర్ అమ్మకాలను.. తప్పుపడుతూ.. ఇది ఒక్క లిక్కర్ స్కామ్ అంటూ.. ఎవరో ఒకరి చేత అబద్ధపు స్టేట్మెంట్ ఇప్పించి.. వాటి ఆధారంగా ఈ అరెస్టులకు పాల్పడడం అత్యంత దుర్మార్గమన్నారు .లిక్కర్ స్కామ్ అని చెబుతూ.. ప్రభుత్వ అధికారులను బెదిరించి, నిర్బంధించి వారిని ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ గురించి ఇంకొకసారి ఏ ఒక్కరైనా మాట్లాడాలంటే భయపడాలి.. అన్న భావన కలిగించేలా.. ఈ అక్రమ అరెస్టులు దాడులను ప్రభుత్వమే చేయిస్తుందన్నారు.వైసీపీ గవర్నమెంట్ లో లిక్కర్ అమ్మకాల విషయంలో .. ప్రతి బాటిల్ ను స్కాన్ చేసి..అత్యంత పారదర్శకంగా.. ప్రతి రూపాయి ప్రభుత్వ ఖజానాకు చేరేలా.. అమ్మకాలు జరిగాయన్నారు.అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో.. వీధికో బెల్టు షాపు, మద్యం షాపులు వద్ద పరిమిట్ రూములు ఏర్పాటు చేసి.. 24 గంటలు మద్యం అమ్మకాలు సాగించారని తెలిపారు.వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. బెల్ట్ షాపులను పూర్తిగా రద్దుచేసి.. ప్రభుత్వ మద్యం దుకాణాలను తీసుకువచ్చి..నిర్దిష్ట సమయం ప్రకారమే మద్యం అమ్మకాలు సాగించామని గుర్తు చేశారు. ఇలా అత్యంత పారదర్శకంగా.. మద్యం అమ్మకాలను గత ప్రభుత్వం సాగిస్తే.. ఈరోజు దానికి.. మద్యం స్కామ్ అని పేరు పెట్టడం దుర్మార్గం అన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో .. రాజకీయ నాయకులే బినామీ పేర్లతో మద్యం షాపులు పాడుకోవడం చూస్తుంటే ప్రస్తుతం జరుగుతున్నది మద్యం స్కామే నన్న అనుమానం కలుగుతుందన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ విపరీతంగా మద్యం షాపులు తీసుకొచ్చి..తాగుబోతులను పెంచి పోషిస్తూ.. విపరీతంగా జరుగుతున్న హత్యలకు కారణమవుతుందన్నారు.ఈరోజు యువత విపరీతంగా మద్యానికి బానిసై.. క్షణికావేశంలో.. రోడ్డుమీద కనిపించిన వాడిని కనిపించినట్టు హత్యలు చేసే..విష సంస్కృతి చోటు చేసుకుంటుందన్నారు.ఈరోజు అధికారులపై అక్రమ కేసుల విషయంలో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు.. ఇప్పుడున్న అధికారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుందన్నారు.ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. అలాగే వారితో ప్రభుత్వ పెద్దలు చేయిస్తున్న తప్పులు చూస్తుంటే.. రేపటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయితే.. తమ పరిస్థితి ఏంటి అన్న భావన ప్రతి ఒక్క అధికారిలో కలుగుతుందన్నారు.తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆందోళన చెందుతున్నారని.. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను వేధిస్తున్న కూటమి ప్రభుత్వం రేపటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏంటా అన్న భయం ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుల్లో మొదలైందన్నారు.తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచించుకోవాలని.. ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఎత్తి చూపే వారిపై కేసులు పెట్టడం.. సరికాదన్న భావన వారిలో కూడా కలగాలన్నారు.గత ప్రభుత్వంలో పని చేసిన అధికారులందరి నిర్బంధించి.. వారిని ఇబ్బంది పెట్టాలి అంటే ఇది సరైన... విధానం కాదని.. దీనిపై ప్రభుత్వం పునరాలోచించుకోవాలని హెచ్చరించారు.కూటమి ప్రభుత్వం ఇదే నియంతృత్వ ధోరణిలో వ్యవహరిస్తే.. దీనిని ప్రజాస్వామ్యం అనమని నియంతృత్వం అంటామని అన్నారు.కూటమి ప్రభుత్వం ఇదే ధోరణిలో వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని ఆ తిరుగుబాటులో పెద్దపెద్ద ప్రభుత్వాలే కూలిపోయాయి అన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలన్నారు.ఈరోజు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి లాంటి సీనియర్ ఐ ఏ ఎస్ అధికారుల అక్రమ అరెస్టులను.. ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అక్రమ అరెస్టులను ..తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు.