ప్రైవేటు హాస్టల్ శేజమానులు ఇస్తున్న కాసులకు కక్కుర్తి పడుతున్న ప్రభుత్వ అధికారులు
అబ్దుల్లాపూర్మెట్ మండల ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ శూన్యం
పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రవేట్ హాస్టల్ యజమానులు
బీసీ పీపుల్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్
అబ్దుల్లాపూర్ మెట్టు. మన న్యూస్ :- ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని అబ్దుల్లాపూర్ మెట్టు మండల పరిధిలో పుట్టగొడుగుల వెలుస్తున్న ప్రైవేటు హాస్టల్స్. బీసీ పీపుల్స్ ఫెడరేషన్ దృష్టికి రావడం జరిగింది. బీసీ పీపుల్స్ ఫెడరేషన్ పర్యవేక్షణలో మండల పరిధిలో ఉన్న హాస్టల్స్ ఎలాంటి పర్మిషన్ లేకుండా గత కొన్ని ఏళ్లుగా నిర్వహిస్తున్నారని మండల పరిధిలో ఎమ్మార్వో కు ఎంపీఓ కు ఫిర్యాదు చేయడం జరిగింది. హాస్టల్లు నిర్వహిస్తున్నటువంటి బిల్డింగ్ ఓనర్ హాస్టల్ నిర్వాహకులు ఇష్టానుసారంగా వారికి నచ్చిన రీతిలో పేద విద్యార్థుల దగ్గర ఐదు వేల నుండి పదివేల రూపాయలు హాస్టల్ ఫీజుల రూపంలో వసులు చేస్తా ఉన్నారు. కనీసం నిబంధనలు పాటించలేదు. గతంలో హాస్టల్లో ఒక నిరుపేద విద్యార్థి హాస్టల్ గదిలోనే సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఆ సూసైడ్ చేసుకున్నటువంటి విద్యార్థికి బిల్డింగ్ ఓనర్ గాని హాస్టల్ నిర్వహిస్తున్న నిర్వాకులు గాని వారిని అక్కడి ప్రజాప్రతితులు గాని ఆ విద్యార్థికి ఎలాంటి న్యాయం జరగలేదని తల్లిదండ్రులు వాపోయారు.వారి కుటుంబాన్ని ఆదుకున్న పాపాన పోలేదు.
అధికారుల నిర్లక్ష్యం ఇటు ప్రజా ప్రతినిధులు కూడా అటువైపు చూడకపోవడము హాస్టల్ నిర్వాహకులు మేము ఎంత చెపితే అంత అనే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్నటువంటి హాస్టల్లో పైన అధికారుల అలసత్వం అక్కడున్న అధికారులు హాస్టల్ యజమానులు ఇస్తున్నటువంటి కాసులకు కక్కుర్తి పడి అటు విద్యార్థుల తల్లిదండ్రులకు ఇటు ప్రభుత్వాలకు గండి కొడుతున్నటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఫైర్ సేఫ్టీ , బిల్డింగ్ పర్మిషన్,పోలీస్ పర్మిషన్, మండల అధికారినుండి , మున్సిపల్ అదికారుల నుండి విద్యుత్ అధికారుల నుండి ఎలాంటి పర్మిషన్ లేకుండా డొమెస్టిక్ సిలిండర్లు వాడుతు బిల్డింగ్ పార్కింగ్ లేకుండా గత కొన్ని ఏళ్లుగా అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలో దాదాపుగా 70 నుంచి 80 హాస్టల్స్ అధికారుల కళ్ళు గప్పి ఇటు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి హాస్టల్ యజమానులు నెలకు లక్షల్లో సంపాదిస్తున్నరు. జిఎస్టి ,సిజిఎస్టి కట్టకుఢా ప్రభుత్వ ఖజానకు గండి కొడుతున్బారు.
మండల పరిధిలో ఉన్నటువంటి అధికారులు హాస్టల్లపైన దృష్టి సారించవలసిన అవసరం ఉన్నది