Mana News :- జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయం లో కొందరు అధికారుల వలన రాష్ట్రానికి తలవంపులు తీసుకొచ్చారు. పలువురు ఐఏఎస్ లు, ఐపీఎస్ లు జగన్ కి ఊడిగం చేయటం వలన ఈరోజు ఊచలు లెక్కపెట్టే పరిస్థితి వచ్చింది. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉంటూ రాజ్యాంగబద్ధంగా పనిచేయకుండా రాజారెడ్డి రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేసి ఈరోజు జైలు బాట పడుతున్నారు .
కోట్లాది రూపాయలు ప్రజాదనాన్ని కాపాడవలసినటువంటి అధికారులు జగన్ అడుగులకు మడుగులు ఒత్తి రాష్ట్రానికి భారతదేశంలోనే చెడ్డ పేరు తీసుకొచ్చారు. వాళ్ల తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఏఎస్ లను భయపెట్టి వాళ్ళ దగ్గర తప్పుడు పనులు చేయించి జైలు బాట పట్టించారు. వీటిని నుండి గుణపాఠం నేర్చుకోని కొందరు బ్యూరోక్రాట్లు ఈరోజు జైలు బాట పడుతున్నారు. రాష్ట్రంలో డిజిపి స్థాయి అధికారి సీతారామాంజనేయులు, అదేవిధంగా ఐఏఎస్ అధికారులు, కేంద్ర సర్వీస్ అధికారులు వాసుదేవ రెడ్డి, వెంకట్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి తో పాటు పలువురు జైలు బాట పట్టడం దురదృష్టకరం. రాజశేఖర్ రెడ్డి హయాంలో పనిచేసి ఓఎంసీ కేసులో రాజగోపాల్ నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష పడటం, జగన్మోహన్ రెడ్డికి చేసిన పాపాలకి వీళ్లకు కూడా భాగస్వామి ఉండటం వలన అధికారులతో జైలు నిండుతున్నాయిఅధికారుల కుటుంబాలు మనోవేదనకు లోనౌ వుతున్నాయి . ప్రజలకు సహాయం చేయకుండా… అధికారులు వైసీపీ నాయకులకు వంత పాడటం వలన ఈరోజు జైలుకు వెళుతూ, రాష్ట్రానికి తలంపులు తీసుకొస్తున్నారు. ఈ ప్రెస్ మీట్ లో టిడిపి కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేష్ యాదవ్, నియోజకవర్గ అధ్యక్షుడు ధరణి ప్రకాష్, పాల్గొన్నారు