మన న్యూస్ ప్రతినిధి పుతలపట్టు నియోజకవర్గం మే-17:- పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ కార్యాలయంలో పూతలపట్టు నియోజకవర్గం పరిధిలోని బంగారుపాళ్యం, యాదమరి మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల ఎంపిక ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ అధ్యక్షత వహించి బంగారుపాళ్యం, యాదమరి మండలాల నూతన అధ్యక్షులను ప్రకటించారు. చిత్తూరు జిల్లా ముఖ్య నాయకులు, పూతలపట్టు నియోజకవర్గం ముఖ్య నాయకులు, కార్యకర్తల సమక్షంలో జరిగిన ఎన్నికలో బంగారుపాళ్యం మండల అధ్యక్షుడిగా ఎన్.పి.ధరణీ నాయుడు మరియు యాదమరి మండల అధ్యక్షుడిగా మురార్జీ యాదవ్ రెండోవ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన ఎన్.పి.ధరణీ నాయుడు, మురార్జీ యాదవ్ లకు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ పట్ల వీరు చూపిన నిబద్ధతను ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ... పూతలపట్టు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుల ఎంపికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే ఐరాల, పూతలపట్టు మండలాల అధ్యక్షుల ఎంపికలు పూర్తయ్యినట్లే, బంగారుపాళ్యం మరియు యాదమరి మండలాల అధ్యక్షులను కూడా ఏకగ్రీవంగా ఎంపిక చేయడం తెలుగుదేశం పార్టీ ఐక్యతను సూచిస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూచనల మేరకు పార్టీ వ్యవస్థ పటిష్ఠంగా ముందుకు సాగుతున్నదని స్పష్టం చేశారు. గ్రామ స్థాయిలో బూత్ కమిటీల నుండి గ్రామ కమిటీలు, యూనిట్లు, క్లస్టర్లు మరియు అనుబంధ సంఘాల వరకు నియామకాలను మహానాడు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. పార్టీలో ప్రతి కార్యకర్తకి గౌరవం కలిగేలా పార్టీ నాయకత్వాన్ని ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. తవణంపల్లె మండలాన్ని మినహాయిస్తే మిగిలిన అన్ని మండలాల అధ్యక్షుల ఎంపిక పూర్తి చేయడం జరిగిందన్నారు. ప్రజల సమక్షంలో పారదర్శకమైన ఎంపికను నిర్మిస్తున్నామని, సంస్థాగత ఎన్నికలకు సైతం తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. గతంతో పోలిస్తే పూతలపట్టు నియోజకవర్గంలో టిడిపి మరింత బలంగా ఎదుగుతున్నదని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, చిత్తూరు జిల్లా అధికార ప్రతినిధి గంగారపు గోపి, చిత్తూరు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కోక ప్రకాష్ నాయుడు, పూతలపట్టు నియోజకవర్గం పరిశీలకులు బొమ్మన శ్రీధర్, పూతలపట్టు మండల అధ్యక్షులు దొరబాబు చౌదరి, బంగారుపాళ్యం మండల మాజీ అధ్యక్షులు ఎన్.పి.జయప్రకాష్ నాయుడు, బంగారుపాళ్యం మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ఎన్.పి.జయచంద్ర నాయుడు, బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ ఛైర్మన్ భాస్కర్ నాయుడు, టిడిపి నాయకులు ఎల్.బి.లోకేష్ రెడ్డి మరియు పూతలపట్టు నియోజకవర్గం ముఖ్య నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.