మన న్యూస్ ప్రతినిధి తవణంపల్లె మే-17:- చెన్నై అపోలో ఆసుపత్రిలో డైరెక్ట్ యాంటీరియర్ అప్రోచ్ అధునాతన పద్ధతులతో తుంటి మార్పిడి ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు ప్రముఖ ఆర్తో సర్జన్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి అరగొండ అపోలో ఆసుపత్రి ఏవో చంద్రశేఖర్ రెడ్డిలు తెలిపారు. శనివారం వారు అరగొండ అపోలో ఆసుపత్రిలో విలేకరులతో మాట్లాడుతూ చెన్నై అపోలో ఆసుపత్రిలో అతి తక్కువ ఖర్చుతో అధునాతనమైన డైరెక్ట్ యాంటీరియర్ అప్రోచ్ పద్ధతిలో ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇప్పటివరకు ఏడు ఆపరేషన్లను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ఆపరేషన్లో నిర్వహించిన రోగి అదే రోజు లేచి ఎటువంటి ఆధారం లేకుండా నడవగలుగుతుందని నెల రోజుల్లో తమ వ్యక్తిగత కార్యకలాపాలను యధావిధిగా చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఆపరేషన్ల ద్వారా జాయింట్లలో స్థిరత్వం మెరుగవుతుందన్నారు అపోలో చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఆపరేషన్లను తక్కువ ఖర్చుతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. త్వరలో అరగొండ అపోలో ఆసుపత్రిలో కూడా ఈ విధమైన అదునాతన డైరెక్టర్ అప్రోచ్ ఆపరేషన్లను నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి ఏవో చంద్రశేఖరరెడ్డి తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఆర్తో వైద్య నిపుణులు డాక్టర్ కార్తీక్ రెడ్డి, డాక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ శ్రీనివాసులు, పిఆర్ఓ కమ్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.