మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించి ఆదుకుంటామని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు అన్నారు.పిట్లం మండల కేంద్రంలోని ఏఎంసీ ఆవరణలో పిట్లం,నిజాంసాగర్ మండలంలోని ఆయా గ్రామాల్లోని లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, నిజాంసాగర్ మండలంలోని వివిధ గ్రామాల్లోని లబ్ధిదారులకు దళిత బంధు చెక్కులను ఎమ్మెల్యే అందజే శారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మనోజ్ కుమార్,కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు హన్మాండ్లు, సొసైటీ ఛైర్మన్ నాగిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ సాయినాథ్, ఎన్ఎస్ఈయూఐ నియోజ కవర్గ అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, నాయకులు రాంరెడ్డి,బాల్ రాజ్, మురళీధర్ గౌడ్,నిజాం సాగర్,మొహమ్మద్ నగర్ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ రవీందర్ రెడ్డి,తదితరులు ఉన్నారు.