మన న్యూస్, ఎస్ఆర్ పురం:-
ఎస్ఆర్ పురం మండలం 49 కొత్తపల్లి మిట్ట లో మహాభారతం ఉత్సవాలు భాగంగా శుక్రవారం ఘనంగా ద్రౌపతి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు ద్రౌపదీ సమేత ధర్మరాజుల స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు.అనంతరం స్వామి అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని చూడడానికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వామి అమ్మవారి కళ్యాణోత్సవానికి సంజీ వంశీకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, సంపూర్ణమ్మ ,పురుషోత్తం లక్ష్మీ,కుటుంబ సభ్యులు ఉభయ దారులుగా వ్యవహరించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త నాగరాజు సురేష్ బాబు దేవరాజు రెడ్డి సునీల్ గ్రామస్తులు పాల్గొన్నారు.