మన న్యూస్, ఎస్ఆర్ పురం:-
ఎస్ఆర్ పురం మండలం ,49 కొత్తపల్లి మిట్ట గ్రామంలో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు దాసరి సంపంగి అనారోగ్యంతో గురువారం మృతి చెందాడు. సమాచారం అందుకున్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, చిత్తూరు వైఎస్ఆర్సిపి ఇన్చార్జి విజయానందరెడ్డి సంపంగి మృతదేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు గురువారెడ్డి, ఎంపీపీ సరిత జనార్ధన్, యువ నాయకుడు శ్యామ్, స్కైలా, స్థానిక సర్పంచ్ డిల్లయ్య, ఎంపీటీసీ సభ్యులు కోటిరెడ్డి బాబు, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి చందు రాజు, మాజీ మార్కెట్ కమిటీ సభ్యులు గోవింద్ రెడ్డి, కో ఆప్షన్ నెంబర్ యేసయ్య, జిల్లా క్రియాశీలక కార్యదర్శి కుప్పయ్య, రిటైర్డ్ టీచర్ దొరస్వామి, ప్రసాద్ రెడ్డి, హరి రెడ్డి, యుగంధర్,మణి, ముత్యాలు, బాబు, మహేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.