మన న్యూస్ సాలూరు 16:=పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుపోలీసుల భద్రత నడుమ పండుగను సక్రమంగా జరిపిస్తాం పోలీసుల భద్రత నడుమ శ్యామలాంబ అమ్మవారి పండుగను సక్రమంగా జరిపిస్తామని పట్టణ సీఐ వాసునాయుడు అన్నారు. శుక్రవారం సీఐ స్టేషన్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదివారం, సోమవారం, మంగళవారం జరిగే శ్యామలాంబ అమ్మవారి పండగలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలుకు తావు లేకుండా ప్రజలందరూ సహకరించాలని కోరారు. సినిమానోత్సవం మూడున్నర కిలోమీటర్లు ఉంటుందన్నారు. సిరిమాను పలుచోట్ల ఆగే విధంగా కట్టదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేస్తామన్నారు. ఆ సమయంలో భక్తులందరూ సిరిమానుని దర్శించుకోవాలని అన్నారు. సుమారు 67 సీసీ కెమెరాలు, నాలుగు డ్రోన్లతో పట్టణంలో సిరిమాను తిరిగే చోట ఏర్పాటు చేస్తామన్నారు. తొలేలు ఉత్సవం, అంజలి రథం, సినిమానోత్సవంలో 1000 మంది పోలీసులు పాల్గొంటారన్నారు. అలాగే పట్టణంలో పాత బిల్డింగులు కొన్ని గుర్తించామన్నారు సిరిమాను తిరిగేటప్పుడు భవన యజమానులు అధిక సంఖ్యలో భవనాలపైకి వెల్లకూడదని అన్నారు. ప్రజలందరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. అలాగే ఆదివారం సాయంత్రం నుండి పట్టణంలోకి భారీ వాహనాలకు అనుమతి లేదన్నారు. ప్రయాణికులకు ఆటంకం కలక్కుండా ఆటోలు తిరుగుతాయన్నారు. అందరూ పై విషయాలను దృష్టిలో పెట్టుకొని మెలగాలన్నారు. ఆకతాయిలు పండుగ సమయంలో మద్యం సేవించి అల్లర్లు సృష్టించాలని చూస్తే చట్టపరంగా శిక్షార్హులు అవుతారన్నారు.