మన న్యూస్ ప్రతినిధి,ఏలేశ్వరం:- స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మరణించాడు. ఈ సమాచారాన్ని స్థానిక పోలీసు వారు తెలుసుకున్న వెంటనే స్వామి వివేకానంద సేవాసమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావుకు తెలియజేశారు.ఆయన వెంటనే పోలీసుల సహకారంతో,వివేకానంద సేవా సమితి సభ్యులతో కలిసి వచ్చి అనాధ శవాన్ని స్మశాన వాటికకు తీసుకుని వెళ్లి దహన సంస్కారాలను చేపట్టారు.ఈ కార్యక్రమంలో మల్ల మురళి,శేఖర్,పోలీస్ సిబ్బంది బ్రహ్మానందం పాల్గొన్నారు.