మన న్యూస్,తిరుపతి: తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిలుపుతో పాటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వచ్చి తనను కలవమని పిలుపునివ్వటం తో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రమణ్యం హుటా హుటిన బయలుదేరి అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ ను శుక్రవారం కలిశారు. మంత్రి నారా లోకేష్ కు కోడూరు బాలసుబ్రమణ్యం శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుపతి నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో తాజా పరిస్థితి తో పాటు పలు విషయాలపై చర్చించి అధినాయకుడు నారా లోకేష్ తగు సూచనలు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీని అంట పెట్టుకుని, పార్టీని జీవితము పార్టీ బలోపేతము లక్ష్యంగా పనిచేస్తున్న వారికి రాబోయే రోజుల్లో నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు కోడూరు బాలసుబ్రమణ్యం తెలిపారు. కడపలో ఈనెల ఆఖరి వారంలో జరగబోయే మహానాడులో తిరుపతి, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ముఖ్య నేతలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరినట్లు చెప్పారు. అలాగే మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవి వరించింది. ఆ పదవి పట్ల మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పూర్తి అసంతృప్తిగా ఉన్నారని, ఆమెకు ప్రకటించిన పదవీపట్ల సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం భేటీలో మంత్రి నారా లోకేష్ ఆరా తీసినట్లు సమాచారం. మంత్రిని కలిసిన వారిలో కోడూరు బాలసుబ్రమణ్యం తో పాటు టిడిపి రాష్ట్ర కార్యదర్శి బుల్లెట్ రమణ, తెలుగు యువత రాష్ట్ర నేత మధుబాబు లు ఉన్నారు. త్వరలో ప్రకటించబోయే రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల్లో డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం కు మంచి ప్రాధాన్యత కలిగిన పదవి లభించే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.