
మన న్యూస్, గూడూరు,మే 16: *గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ కు ఘన స్వాగతం పలికిన టిడిపి నాయకులు.*గూడూరు డివిజన్లో మొదటి తిరంగా ర్యాలీ విజయవంతం చేసిన ఎన్డీఏ కూటమి శ్రేణులు.*యుద్ధం గెలిచిన అనంతరం జరిగే పండుగను ఘనంగా నిర్వహించిన ఎన్ డి ఎ కూటమి నేతలు.*ఈ విజయోత్సవంలో కీలక పాత్ర పోషించిన పాపా రెడ్డి మనోజ్ రెడ్డి.*గూడూరు డివిజన్ తెలుగుదేశం పార్టీ డివిజన్లోని అన్ని మండలాల కీలక నేతలు ర్యాలీలో పాల్గొన్న వైనం.*అంతులేని విజయానందోత్సవంలో మునిగిన మహిళలు, ప్రజలు.తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన దేశం కోసం- మనం సైతం అనే నినాదంతో నిర్వహించిన తిరంగా ర్యాలీ విజయవంతం అయింది. ముందుగా విద్యానగర్ నుండి గూడూరు శాసనసభ సభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ కు స్వాగతం పలుకుతూ, పాపారెడ్డి మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీతో వాకాడుకు చేరుకున్నారు. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ను అధికారులు, ఎన్ డి ఎ కూటమి శ్రేణులు వాకాడులో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ నాయకులు సునీల్ కుమార్ కు గజ మాలతో సత్కరించారు. వాకాడు అశోక పిల్లర్ నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకు భారీ బాణా సంచాలు కాలుస్తూ, విజయోత్సవ వేడుక లాగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో మహిళలు హాజరై అడుగడుగునా గూడూరు శాసనసభ సభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ కు నీరాజనం పలికారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాపారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి, దువ్వూరు మధు రెడ్డి, సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, బిజెపి ఇన్చార్జి గూడూరు పాపా రెడ్డి పురుషోత్తం రెడ్డి,సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసులు, తాసిల్దార్ రామయ్య, టిడిపి రాష్ట్ర మహిళా నాయకురాలు మట్టం శ్రావణి, చిట్టమూరు మాజీ జడ్పిటిసి సభ్యులు దువ్వూరు భారతమ్మ, వాకాడు మాజీ జడ్పిటిసి సభ్యులు బత్తిన ప్రమీల, కోట వాకాడు చిట్టమూరు మండలాలు చెందిన పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
