మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
ఉగ్రవాదులకు,పాకిస్తాన్ కు ఆపరేషన్ సింధూర్ ద్వారా గుణపాఠం చెప్పిన భారత త్రివిధ దళాలకు,ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సంఘీభావంగా శుక్రవారం కాకినాడ మెయిన్ రోడ్ టుటౌన్ నుండి మసీద్ సెంటర్ వరకు జరిగిన తిరంగా యాత్రలో కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రెటరీ, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జి మట్టా మంగ రాజు, కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఉమ్మిడి వెంకట్రావు,ప్రత్తిపాడు నియోజకవర్గ బీజేపీ నాయకులు పైలా సుభాష్ చంద్రబోస్,ఏలేశ్వరం మండల అధ్యక్షులు పైలా అయ్యప్ప,ఏలేశ్వరం రూరల్ మండల అధ్యక్షులు నీలి సురేష్, రౌతులపూడి మండల అధ్యక్షులు లవుడు శ్రీను,ప్రత్తిపాడు మండల అధ్యక్షులు ఊటా వీరబాబు, ఏలేశ్వరం మండల బీజేపీ ఎస్సి సెల్ నాయకులు థామస్ మరియు భారతీయ జనతా పార్టీ మరియు ఎన్డిఎ కూటమి తరుపున పెద్ద ఎత్తున శ్రేణులు,నాయకులు పాల్గొన్నారు.