Mana News:- ఏలేశ్వరం (మన న్యూస్ ప్రతినిధి) ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా లింగంపర్తి గ్రామంలో లేఅవుట్ - 2 నందు మండల అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మండల ప్రత్యేక అధికారి పాల్గొన్నారు ఈ సందర్భంగా మండల అధికారి మాట్లాడుతూ మరుగుదొడ్డి ఆత్మ అభిమానం నకు సంబంధించిన అంశము మరియు ప్రజల ఆరోగ్యం నకు సంబంధించిన అంశం , ముఖ్యంగా బహిరంగ మలవిసర్జన ద్వారా వ్యాధులు వ్యాప్తి చెందుతున్నవి, కావున ప్రతి ఒక్కరు టాయిలెట్ నిర్మాణం చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించియున్నారు . అలాగే గ్రామ పంచాయతీలో పని చేయుచున్న క్లాప్ మిత్రల వారి సేవలు గాను మండల ప్రత్యేక అధికారి సన్మానించియున్నారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రజల పెద్ద ఎత్తున పాల్గోనట్లు చేసి వారికి అవగాహన కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్. ఎన్. మల్లికార్జునరావు ( డి హెచ్ ఓ ) జిల్లా ఆర్టికల్చర్ ఆఫీసర్. కె.వి. సూర్యనారాయణ (ఎంపీడీవో ),వీ. సాయి శ్రీలక్ష్మి ( ఆర్డబ్ల్యూఎస్ జేఈ), ఏ. శ్రీవల్లి ఏవోహార్టికల్చర్ , ఎం . సరస్వతి ఏపీఎం వెలుగు, ఏ. మణికంఠ హౌసింగ్ ఏఈ , ఆర్. వీర్రాజు పంచాయతీ కార్యదర్శి సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.