
మన న్యూస్, వెంకటాచలం, మే 15:*ఐదేళ్ల తర్వాత మళ్లీ యాంత్రీకరణ, *రైతులకు సబ్సిడీపై పవర్ స్ప్రేయర్లు, రొటావేటార్లు, బ్రష్ కట్టర్లు, ట్రాక్టర్ డ్రాన్లు.వెంకటాచలం మండలంలో గురువారం 30 మంది రైతులకు పవర్ స్ర్పేయర్లు, ఇద్దరికి బ్రష్ కట్టర్లు అందజేసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి మాట్లాడుతూ........వైసీపీ ఐదేళ్ల పాలనలో వ్యవసాయ శాఖను మూతేశారు ,దేశమంతా అమలైన అనేక వ్యవసాయ పథకాలు ఏపీ రైతులకు అందకుండా పోయాయి ,టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ వ్యవసాయ శాఖలో యాంత్రీకరణ ప్రారంభమైంది అని అన్నారు.ఒక్కో పవర్ స్ప్రేయర్ పై రూ.10 వేలు, బ్రష్ కట్టర్ పై 17,340 సబ్సిడీ వస్తుందన్నారురైతులు సద్వినియోగం చేసుకుని మంచి దిగుబడులు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను అని తెలియజేశారు.
