కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: మే 16: జిల్లా కలెక్టర్ & జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాల మేరకు బద్వేల్, గోపవరం మండలాలకు చెందిన విత్తన, ఎరువులు, పురుగు మందుల డీలర్ల దుకాణాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసిన వ్యవసాయం అధికారి ఎం నాగరాజు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విత్తన నిల్వలు ,పురుగుమందుల స్టాక్,ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్స్, స్టాక్ & ధరల ప్రదర్శన బోర్డ్ , రిజిస్టర్ లు పరిశీలించడం జరిగింది. రసీదులు తప్పని సరిగా ఇవ్వాలని విధిగా రసీదులు రైతులకు ఇవ్వాలని , గరిష్ట అమ్మకపు ధర లోబడే అమ్మాలని హెచ్చరించారు. చట్ట బద్ధ వ్యాపారం నిర్వహించాలి అని తెలిపారు. ధనలక్ష్మి సీడ్స్ దుకాణం లో వరి విత్తన నిల్వలు (బీపీటీ 5204, NDLR-7) ఉన్నవి. అలాగే భాగ్యలక్ష్మీ ఫెర్టిలైజర్స్ & జనరల్ మర్చంట్ వారి వద్ద అన్ని రకాల ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నవి. సాయికృష్ణ ట్రేడర్,శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఫెర్టిలైజర్స్ దుకాణాలను కూడా తనిఖీ చేసి పలు రికార్డ్స్‌ను ను పరిశీలించడం జరిగింది. ఈ తనిఖీలో మండల వ్యవసాయ అధికారి బద్వేల్ కే చంద్ర మోహన్ రెడ్డి,గోపవరం మండల బాధ్య అధికారి జి రామకృష్ణయ్య పాల్గొన్నారు.