Mana News:- పాచిపెంట, నవంబర్ 19( మన న్యూస్ ):-మొక్కజొన్న సాగు చేసే రైతులందరూ కత్తెర పురుగు పట్ల తగు జాగ్రత్తలు వహించాలని, ఈ పురుగు విత్తనం నాటిన వారం రోజుల నుండి (గుడ్డుదశ)ఈ పురుగును నివారించుకోవలసిన అవసరం ఉందని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు. పాచిపెంట మండలం మిర్తి వలస గ్రామంలో రైతులు మొక్కజొన్న పంటపై ఆశించే కత్తెర పురుగు గుడ్డు దశ నుండి నివారించడానికి పలు రకాల సూచనలు సలహాలు ఇచ్చారు.ఐదు శాతం వేప గింజల కషాయాన్ని పిచికారి చేయాలని వేప నూనె 5 మిల్లీ లీటర్లు ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని తెలిపారు. నేలలో అన్ని రకాల పోషకాలు లభిస్తాయని వాటిని పంట వేసుకొనే దశలోనికి మార్చుకోవాల్సిన బాధ్యత రైతులoదరు తప్పనిసరిగా ఖరీఫ్ లో పచ్చరొట్ట నవధాన్య విత్తనాలు కలిగి ఉండాలని తెలిపారు. పంట మార్పిడి పాటిస్తూ తప్పనిసరిగా పటాస్ ఎరువును రెండుసార్లు విత్తనంతో పాటు ఒకసారి కంకి ఏర్పడే దశలో మరొకసారి తప్పనిసరిగా వేయాలని ఎకరానికి 15 కేజీలు ఒక్క దఫ్ఫా వేసుకోవాలని సూచించారు.అలాగే భూమిలో కరగని స్థితిలో ఉన్న పొటాషియం కరిగించి మొక్కకు అందించడానికి పొటాష్ రిలీజింగ్ బ్యాక్టీరియా రాయితీపై వ్యవసాయ శాఖ అందిస్తుందని ఎకరానికి ఖర్చు 100 రూపాయలు లోపే ఉంటుందని కాబట్టి రైతులందరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రతినిధి పోల్ నాయుడు గ్రామ వ్యవసాయ సహాయకులు దినేష్ కుమార్ పాల్గొన్నారు.