గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 15 ;-జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణం మెయిన్ రోడ్ లోని అమ్మ భవాని టెంపుల్ ఎదురుగా ఉన్న డైరెక్టర్ వైద్య రామేశ్వర్ రెడ్డి ఆహ్వానం మేరకు…శ్రీ సన్ లైఫ్ పాలిక్లినిక్ లో కర్నూలు లోని ప్రముఖ వైద్యుల చేత ఐజ పట్టణంలోఉచిత మెడికల్ క్యాంపు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని అభినందనలు తెలియచేసిన ఐజ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాస్టర్ మధుకుమార్ మిత్రబృందం. మాస్టర్ మధుకుమార్ మాట్లాడుతూ… ఐజ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను తరచూ నిర్వహించాలని కోరారు. ఈ సందర్బంగా డైరెక్టర్ వైద్య రామేశ్వర్ రెడ్డి, ఇక్కడకు విచ్చేసిన కర్నూలు లోని ప్రముఖ వైద్యులకు ప్రత్యేక అభినందనలు తెలియచేశారు . ఈ కార్యక్రమంలో మధు మాస్టర్ మిత్రబృందం తదితరులు పాల్గొన్నారు.