ఒకరు మృతి మరో ఇద్దరికి తీవ్రగాయాలు , అలంపూర్/ఎర్రవల్లి: పొద్దు పొద్దుగాల ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 15 :- :-వివరాల్లోకి వెళితే అయిజ మండలం గురుదొడ్డి గ్రామానికి చెందిన భూషణ్ రెడ్డి తన భార్య తిమ్మమ్మ, కుమారుడు జగన్మోహన్ రెడ్డి తో కలిసి బైకుపై పెబ్బేరు మండలం గంగారం గ్రామానికి బయలుదేరారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం జింకలపల్లి స్టేజి సమీపంలో 44వ జాతీయ రహదారిపై వీరీ బైకును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భూషణ్ రెడ్డి భార్య తిమ్మమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. భూషణ్ రెడ్డి మోహన్ రెడ్డికి, కుమారుడు కి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన హైవే అంబులెన్స్ లో గద్వాల ఆసుపత్రికి తరలించామని హైవే అంబులెన్స్ ఈఎంటి వెంకటేష్, పైలెట్ ప్రవీణ్ గౌడ్ తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.