గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 15 :- జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే విజయుడు హాజరై లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు . ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లల పెళ్లి కానుకగా ప్రభుత్వం లక్ష 116 రూపాయలు ప్రభుత్వం అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన కళ్యాణ లక్ష్మి & షాదిముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులు సకాలంలో బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలంపూర్, ఐజ, ఉండవెల్లి, ఇటిక్యాల, మానవపాడు, వడ్డేపల్లి, రాజోలి, ఎర్రవల్లి, మండలాలకు చెందిన "70 మంది లబ్ధిదారులకు 70లక్షల 8వేల 120రూపాయలు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ సీఎంఆర్ఎఫ్ 102 మంది లబ్ధిదారులకు 25 లక్షల 88వేల 500రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల తహశీల్దారులు రెవెన్యూ సిబ్బంది, బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.