గొల్లప్రోలు మే 15 మన న్యూస్ :- అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ జయంతిని గురువారం గొల్లప్రోలులో స్వచ్ఛ గొల్లప్రోలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీ నగర్ లోని స్వామి వివేకానంద జ్ఞాన మందిరంలో కాటన్ చిత్రపటానికి స్వచ్ఛ గొల్లప్రోలు సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ నీటి పారుదల రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తు చేసారు. దవళేశ్వరం వద్ద ఆయన నిర్మించిన ఆనకట్ట చిరస్మరణీయమన్నారు. ఈ ఆనకట్ట ద్వారా లక్షలాధి ఎకరాల భూములకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద జ్ఞాన మందిరం వ్యవస్థాపకులు పడాల కన్నారావు, మాజీ ఎంపీపీ వర్ధనపు వీర్రాజు,స్వచ్ఛ గొల్లప్రోలు కన్వీనర్ కొశిరెడ్డి రాజా, సభ్యులు చోడపునీడి పుల్లపరాజు, దర్శిపూడి విశ్వేశ్వరరావు కొమ్ము సత్యనారాయణ, కర్రి కొండలరావు, కీర్తి ఆదినారాయణ, బొండాడ వెంకటరమణ, మలిరెడ్డి సత్య నారాయణ,బోడకుర్తి మహేష్ తదితరులు పాల్గొన్నారు.