Mana News :- 13వ తేదీన ప్రకటించిన CBSE ఫలితాల్లో, మంగళ్ విద్యాలయ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి పాఠశాల కీర్తిని పెంచారు.ముందుగా 12తరగతి ఫలితాలలో MPC లో T. చందన 500 మార్కులకు 456 మార్కులతో మొదటి స్థానంలో నిలిచింది. అదేవిధంగా PCB లో ఎల్.సంజన 500 మార్కులకు గాను 449 మార్కులు సాధించింది.MEC లో పి.సంధ్య 500 మార్కులకు గాను 425 సాధించింది. CEC లో ఆర్. హర్షణ 500 మార్కులకు గాను 419 మార్కులు సాధించింది. అలాగే 10వ తరగతి ఫలితాల్లో కూడా విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించారు. బి రితిక 500 మార్కులకు గాను 484 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచింది అలాగే ద్వితీయ స్థానంలో బి దేవకీ నందన్ 479/500 మార్కులు,సాధించాడు. జి.విద్య,బి శ్రావ్య 478/500 మార్కులు సాధించి తృతీయ స్థానంలో నిలిచారు. అలాగే తెలుగులో 17మంది విద్యార్థులు, సాంఘికశాస్త్రంలో ఒకరు, నూటికి నూరు100/100 మార్కులు సాధించి పాఠశాల కీర్తిని అత్యున్నత స్థాయిలో నిలబెట్టారు.
విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడు గారు విద్యార్థులకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు తన అభినందనలు తెలియజేశారని పాఠశాల ప్రిన్సిపాల్ గల్లా. ధనంజయనాయుడు తెలిపారు.