మన న్యూస్ : శేరిలింగంపల్లి సబ్ స్టేషన్ ల నిర్మాణము కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే అరికపూడి గాంధీ హెచ్ఏండిఏ కమీషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.మంగళవారం అమీర్ పెట్ లోని హెచ్ఏండిఏ కార్యాలయంలో కమీషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ను మర్యాదపూర్వకంగా కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు పలు అభివృద్ధి పనులపై పీఏసీ చైర్మన్, ఆరెకపూడి గాంధీ చర్చించారు.శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మయూరి నగర్, నల్లగండ్ల హుడా కాలనీలలో ప్రజా సౌకర్యార్థం కాలనీల సౌకర్యాల కోసం కేటాయించిన స్థలంలో సబ్ స్టేషన్ ల నిర్మాణం కోసం ఒక ఎకరం స్థలం కేటాయించాలని అనుమతి ఇవ్వాలని,సబ్ స్టేషన్ నిర్మాణం కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే గాంధీ కోరారు.అతి పెద్ద కాలనీలు ఆయిన మయూరి నగర్, నల్లగండ్ల హుడా కాలనీలలో 1 ఎకరం స్థలం కెటయించేలా చర్యలు తీసుకోవాలని , అట్టి స్తలంలో సబ్ స్టేషన్ నిర్మించుకోవడానికి ఎంతగానో తోడ్పడతుంది అని పెద్ద కాలనీ లు కావడం వలన నిత్యం కరెంట్ అంతరాయం ఏర్పడుతుంది అని కాలనీ వాసులకు, పక్క కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు అని, ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్ అందించాలంటే ఆ ప్రాంతంలో సబ్ స్టేషన్ల నిర్మాణము అవసరం ఎంతగానో ఉంది అని , సబ్ స్టేషన్ నిర్మాణము వలన ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని ,ప్రజలకు సాంత్వన చేకూరుతుంది, ప్రజా అవసరాల దృష్ట్యా స్థలం కెటయించాలని, కెటయించిన వెంటనే పనులు చేపట్టి సబ్ స్టేషన్ నిర్మాణము చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చైర్మన్ గాంధీ తెలిపారు. హెచ్ఏండిఏ సర్ఫరాజ్ అహ్మద్ సానుకూలంగా స్పందించారు.