
మన న్యూస్, ఉలవపాడు, మే 14:- ముఖ్య అతిధిగా పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. - కళ్యాణోత్సవం సందర్భంగా స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ. కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి కల్యాణోత్సవం కార్యక్రమంలో బుధవారం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు దంపతులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారిని దర్శించుకున్న ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చకులచే తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటూరు దంపతులతో కలిసి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు, ఫౌండర్ ట్రస్టీ సుధీష్ చంద్ర రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో స్థానిక టిడిపి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
