మన న్యూస్ సాలూరు మే 14:= పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు లో పైలట్ వాటర్ స్కీము పై కౌన్సిలర్ల రసా బసమున్సిపల్ చైర్ పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ అత్యవసర సమావేశం శ్యామలాంబ అమ్మవారి పండుగ సందర్భంగా పట్టణ ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా రెండు కోట్లతో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పైలట్ వాటర్ స్కీమ్ ఏర్పాటు చేసేందుకు నిధులు తీసుకొచ్చారు. అంతవరకు బాగానే ఉంది. ఈ అత్యవసర సమావేశంలో కొందరు వైసిపి కౌన్సిలర్లు ఎక్కడైతే నీటి ఎద్దడి ఉందని అధికారులు, నాయకులు గుర్తిస్తే, ఆయాచోట్ల పైలెట్ వాటర్ స్కీమును ఏర్పాటు చేయాలని అన్నారు. మరికొందరు వాటిని తిరస్కరించే పనిలో ఘర్షణ పడ్డారు. మరికొందరైతే డబ్బివీధలో పైలెట్ వాటర్ స్కీంను ప్రారంబించారు .ఆ శిలాఫలకంపై ప్రోటోకాల్ కూడా పాటించని వైనం కొట్టొచ్చినట్లు ఉందని ఘర్షణకు దిగారు.పండగకు రాజకీయ రంగు పులమడం తగదు.తెదేపా పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు పండుగ సందర్భంగా ప్రజలకు నీటి కష్టాలు తీర్చేందుకు మంత్రి సంధ్యారాణి నడుంబిగించి మునిసిపల్ మంత్రితో మాట్లాడి రెండు కోట్ల నిధులు తీసుకొస్తే దానికి కూడా రాజకీయ రంగు పులమడం ఎంతవరకు సబబు అని తెదేపా నాయకులు వైసీపీ నాయకుల తీరును విమర్శించారు. మంత్రికి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందేమోనని వైసీపీ నాయకుల అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు నిమ్మది తిరుపతరావు ఆరోపించారు. ఏది ఏమైనప్పటికీ పండగను సబవుగా సాగేటట్లు ప్రతి ఒక్కరు తన వంతు సాయం అందించాలని మీడియా ముఖంగా కోరారు. ఈ కార్యక్రమంలో 19వ వార్డు కౌన్సిలర్ వైకుంఠపు హర్షవర్ధన్ మాజీ కౌన్సిలర్ పప్పల మోయిద వైదేహి తదితరులు పాల్గొన్నారు.